వీరజవాన్ మస్తాన్ బాషా శిలాఫలకం ఆవిష్కరణ

నెల్లూరుః మూలాపేట ఈఎస్ఆర్ఎం హైస్కూల్ లో చదివిన వీరజవాన్ మస్తాన్ బాషా జ్ఞాపకార్థం ఆ పాఠశాలలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ వైయస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ పి. రూప్ కుమార్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ నాగరాజుతో కలిసి ఆవిష్కరించారు. ఈసందర్భంగా రూప్ కుమార్ మాట్లాడుతూ...దేశం కోసం ప్రాణత్యాగాలు అర్పించిన జవాన్లే అసలైన హీరోలన్నది విద్యార్థులు తెలుసుకోవాలని సూచించారు. స్థానిక స్కూల్ లో చదివి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మస్తాన్ బాషా ఎంతో గొప్ప వ్యక్తి అని కొనియాడారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసే సైనిక కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఆచార్య, వైయస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. 

Back to Top