మేలు కొలుపు పాద‌యాత్ర విజ‌య‌వంతం

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తికి అడుగ‌డుగునా ఘ‌న స్వాగ‌తం
ముగింపు స‌భ‌కు  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయ‌కులు హాజ‌రు

అనంత‌పురం: ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి చేప‌ట్టిన మేలు కొలుపు పాద‌యాత్ర విజ‌యవంతం అయ్యింది. నియోజ‌క‌వ‌ర్గంలోని ఎల్ల‌నూరు నుంచి గార్ల‌దిన్నె వ‌ర‌కు చేసిన 150 కిలోమీట‌ర్ల పాద‌యాత్రలో అడుగ‌డుగునా ఆ మ‌హానేత వైయ‌స్ఆర్‌ను ప్ర‌జ‌లు గుర్తు చేసుకున్నారు. రాజ‌న్న రాజ్యం వ‌స్తేనే త‌మ‌కు న్యాయం జ‌రుగుతుంద‌న్నారు. ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌లు ప‌ద్మావ‌తి దృష్టికి తెచ్చారు. మేలు కొలుపు ముగింపు స‌భ శ‌నివారం గార్ల‌దిన్నె గ్రామంలో నిర్వ‌హించారు. ఈ స‌భ‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనంత వెంక‌ట్రామిరెడ్డి, ఎమ్మెల్యే వై.విశ్వేశ్వ‌ర‌రెడ్డి, నాయ‌కులు గురునాథ‌రెడ్డి, తోపుదుర్తిప్ర‌కాశ్‌రెడ్డి, త‌దిత‌రులు హాజ‌రై ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ప‌ద్మావ‌తి మాట్లాడుతూ..తాను చేప‌ట్టిన పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను క‌ళ్లారా చూశాన‌ని, ఎక్క‌డికి వెళ్లినా చంద్ర‌బాబు మోసాలు క‌నిపించాయ‌ని తెలిపారు. ప్ర‌తి గ్రామంలో మ‌హానేత దివంగ‌త ముఖ్య‌మంత్రి  వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని గుర్తు చేసుకున్నార‌ని తెలిపారు. తాను ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుంటుంటే ప్ర‌భుత్వం  పాద‌యాత్ర‌ను అడ్డుకోవాల‌ని చూసింద‌న్నారు. తాను ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మాట్లాడ‌కూడ‌ద‌ని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసింద‌న్నారు. ఇలాంటి బెదిరింపుల‌కు భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ముఖ్య‌మంత్రి చేసేంత‌వ‌ర‌కు వెనుక‌డుగు వేసే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టం చేశారు. శింగ‌న‌మ‌ల చెరువుకు నీళ్లు ఇవ్వ‌లేదు కానీ, స్థానిక ఎమ్మెల్యే ఇంట్లో మాత్రం రెండు ప‌ద‌వులు తెచ్చుకున్నార‌ని విమ‌ర్శించారు. 

వ‌ల‌స‌లు నివారించ‌డంలో విఫ‌లం: ఎంపీ మిథున్‌రెడ్డి
చంద్ర‌బాబు ఎప్పుడు అధికారంలోకి వ‌చ్చిన క‌రువు వ‌స్తుంద‌ని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. వ‌ల‌స‌ల‌ను నివారించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కరువు పరిస్థితుల కారణంగా జిల్లాలో 4 లక్షల మంది పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారన్నారు. జిల్లాలో 267 మంది రైతులు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నారన్నారు. సాగు, తాగు నీరు అందడం లేదని, పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉందని పాదయాత్ర ద్వారా ప్రభుత్వం కళ్లు తెరిపించాలని జొన్నలగడ్డ పద్మావతి ‘మేలుకొలుపు’ కార్యక్రమ చేపట్టారన్నారు. అయితే ప్రభుత్వ విప్‌ ప్రభుత్వ పెద్దలతో చర్చించి పోలీసుల ద్వారా పాదయాత్రను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. 


న‌డిరోడ్డుపై న‌వ నిర్మాణ దీక్ష‌లా:  మాజీ ఎంపీ అనంత వెంక‌ట్రామిరెడ్డి
నవనిర్మాణ దీక్షల పేరుతో న‌డిరోడ్డుపై బ‌హిరంగ స‌భ‌లు పెట్ట‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని మాజీ ఎంపీ అనంత‌వెంక‌ట్రామిరెడ్డి ప్ర‌శ్నించారు. అనంతపురంలోని టావర్‌క్లాక్‌ వద్ద న‌వ నిర్మాణ దీక్ష పెట్టి ప్రజలకు ఇబ్బందుల‌పాలు చేశార‌ని విమ‌ర్శించారు. ధర్మవరంలో ప్లెక్సీల కోసం మంత్రి పరిటాల సునీత, స్థానిక ఎమ్మెల్యే అనుచరులు కొట్టుకుంటే పోలీసులు దగ్గర ఉండి బహిరంగ సభ జరిపించలేదా..? అని ప్ర‌శ్నించారు. అనంతపురం ఎమ్మెల్యే, ఎంపీ ఘర్షణ పడితే ప్రత్యేకంగా వారికి సభలు పెట్టించలేదా..? పోలీసులు ప్రజాసామ్యబద్ధంగా వ్యవహరించాలని సూచించారు.  కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డి, సీనియర్‌ నాయకులు  అమరేంద్రనాథ్‌రెడ్డి, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ నారాయణరెడ్డి, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షులు పెన్నోబులేసు, ఎంపీటీసీ సభ్యులు జగ్గాల రవి, వీరాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

Back to Top