ప్లీనరీ విజయంవంతంపై మేకపాటి హర్షం

ఉదయగిరి: ఉదయగిరి నియోజకవర్గ వైయస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశం విజయవంతం కావడంపై ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం తన అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్లీనరీకి ఊహించని స్పందన లభించడం నియోజకవర్గంలో పార్టీకి మంచి శుభపరిణామమన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్‌సీపీ అభ్యర్థిని గెలిపించి జగనన్నను ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషిచేయాలని కోరారు. ఈ ప్లీనరీ విజయవంతం కావడానికి తమ శాయశక్తులా కృషిచేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్‌కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు,జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు,అనుబంధ సంఘాల నాయకులు, మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లోపు పార్టీ అగ్రనేతలతో నియోజకవర్గ స్థాయిలో పలు సమావేశాలు ఏర్పాటుచేసి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషిచేస్తానన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు మల్లు సుధాకర్‌రెడ్డి, సీతారామపురం ఎంపీపీ, సొసైటీ అధ్యక్షులు కల్లూరి జనార్ధన్‌రెడ్డి, చింతంరెడ్డి సుబ్బారెడ్డి,చిన్నాగంపల్లి మాజీ సర్పంచ్‌ దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు అల్లూరురాజు, పార్టీ మండల కన్వీనరు పాణెం రమణయ్య, అక్కి భాస్కర్‌రెడ్డి, తదితరులున్నారు.


Back to Top