కుమ్మక్కు రాజకీయాలపై మేకపాటి మండిపాటు

తిరుపతి 14 జూన్ 2013:

చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా పక్కన పెట్టి వచ్చే స్థానిక ఎన్నికల్లో అందరూ కలసి కట్టుగా పనిచేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తిరుపతిలో శుక్రవారం నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికలు-ప్రజా ప్రతినిధుల సదస్సులో పాల్గొన్న ఆయన టీడీపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కు రాజకీయాలపై మండిపడ్డారు. ఇక నుంచి వచ్చిన ప్రతి ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్  విజయకేతనం ఎగురవేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేకపాటి విజ్ఞప్తి చేశారు.

Back to Top