నెల్లూరు వైయస్‌ఆర్‌సీపీ కంచుకోట

నెల్లూరు: ప్రజలు వైయస్‌ జగన్‌ నాయకత్వాన్ని కోరుతున్నారని, నెల్లూరు జిల్లా వైయస్‌ఆర్‌సీపీ కంచుకోటగా ఉంటుందని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు వైయస్‌ జగన్‌ కోసం ఎదురు చూస్తున్నారని, ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చిందన్నారు. ప్రజలు బాబుకు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు. తప్పనిసరిగా వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బాబు పాలన అప్రజాస్వామికంగా ఉందని చెప్పారు. జన్మభూమి కమిటీలు చెప్పిన వారికే సంక్షేమ పథకాలు ఇస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకొని రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా పాలన సాగిస్తున్నారన్నారు. కడుపేదలకు పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పరిపాలన చూసి కూడా చంద్రబాబు నేర్చుకోలేకపోయారని విమర్శించారు.
 
Back to Top