ఒక్క పైసా కూడా ప్రజలపై భారం మోపొద్దు –  కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టును చంద్రబాబు ఎందుకు తెచ్చుకున్నారు
– వైయస్‌ఆర్‌ ఉండి ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తయ్యేది
– 2014లో చంద్రబాబు మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు
హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఎలా సమీకరించుకుంటారో ప్రజలకు సమాధానం చెప్పాలని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు, ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామ చేసిన మేకపాటి రాజమోహన్‌ రెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు. ఒక్క పైసా కూడా ప్రజలపై భారం మోపొద్దని ఆయన సూచించారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజలకు ఆధునిక దేవాలయమన్నారు.  దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంభించారని, మూడేళ్లలో పూర్తి చేస్తానన్న చంద్రబాబు మాట తప్పారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.  పోలవరానికి ఇప్పటి వరకు రూ.13500 కోట్లు ఖర్చు పెట్టామని చంద్రబాబు చెబుతున్నారని, చంద్రబాబు ఎప్పుడు కూడా పోలవరం గురించి ఆలోచించలేదు.

వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే పోలవరాన్ని పరుగులు పెట్టించారు. దురదృష్టం మహానేత చనిపోవడంతో నత్తనడకన సాగుతోంది. టీడీపీ మేనిఫెస్టోలో మూడేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సి ఉండేది. బీజేపీ, టీడీపీ రెండు పార్టీలు కలిసి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే ప్రజలు సంతోషించేవారు. చంద్రబాబు తన ముడుపుల కోసం పోలవరాన్ని తీసుకున్నారు. దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది.

పోలవరం ఖర్చు రూ.58 వేల కోట్లు ఉంది. మిగిలిన డబ్బు కేంద్రం ఇస్తుందా? కేంద్రమే భరిస్తుందా? లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలా చేస్తోంది. ఏపీ ప్రజలపై ఈ భారం పడకూడదు. పోలవరం ఖర్చు రూ.44,500 కోట్లు చంద్రబాబే తీసుకురావాల్సి ఉంది. ఐదు బడ్జెట్లు అయిపోయిన తరువాత ఇలాంటి పరిస్థితిలో ఈ జూన్‌కే స్పీల్‌వే గేట్లు పూర్తి చేస్తామని, వచ్చే ఏడాదికే గ్రావీటితో నీరు ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారు. నిన్న డయాఫ్రం వాల్‌ను చంద్రబాబు జాతికి అంకితం చేశారు. నెల్లూరు జిల్లాలోని సోమశీల ప్రాజెక్టుకు కూడా డయాఫ్రం వాల్‌ కట్టారు. పోలవరం  వైయస్‌ఆర్‌ కల, వైయస్‌ఆర్‌ హయాంలో పోలవరం 39 శాతం పనులు పూర్తి అయ్యాయి. పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజలకు అధునిక దేవాలయం. వైయస్‌ఆర్‌ బతికి ఉండి ఉంటే ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యి ఉండేది. కేంద్రం పూర్తి చేస్తానంటే చంద్రబాబు తీసుకున్నారు. చద్రబాబు వల్లే పోలవరం పనులు నత్తనడకన సాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడంపై అనేక అనుమానాలు ఉన్నాయి. కుడి, ఎడమ కెనాల్స్‌ను వైయస్‌ఆర్‌ తవ్వించారు. 500 టీఎంసీల దాకా ఈ కాల్వల ద్వారా తీసుకోవచ్చు. విద్యుత్‌ కూడాఉత్పత్తి చేయవచ్చు. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది.   
 
Back to Top