జక్కంపూడికి మేకపాటి పరామర్శ

సంగం_గత వారం రోజుల క్రితం ప్రకాశం జిల్లా టంగుటూరు వద్ద గుండెపోటుతో మృతి చెందిన జక్కంపూడి మురళీ (27) తండ్రి జక్కంపూడి సుబ్బానాయుడును గురువారం ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి గౌతమ్‌రెడ్డి పరామర్శించారు. సంగం మండల వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు కంటాబత్తిన రఘునాధరెడ్డితో సమాచారం అందుకున్న మేకపాటి గౌతమ్‌రెడ్డి జక్కంపూడి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా జక్కంపూడి సుబ్బానాయుడు మాట్లాడుతూ తనకున్న ఒక్కగానొక్క కుమారుడు మురళీ అందరితో మంచిగా నడుచుకునేవాడని, గుండెపోటుతో ప్రకాశం జిల్లా టంగుటూరు వద్ద మృతి చెందాడని అన్నారు. కుమారుడి మృతి మా కుటుంబాలకు తీరని లోటు అన్నారు. దీంతో ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి పెళ్లి కావాల్సిన ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడం బాధాకరమని, ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరని, మనోధైర్యంగా ఉండాలని జక్కంపూడి సుబ్బానాయుడును ఓదార్చారు. అంతకు ముందు నెల్లూరు వైద్యశాలలో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న శశిధర్‌రెడ్డిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు గుండాల బాలచంద్రారెడ్డి, తుమ్మల పెంచలరెడ్డి, మెట్టుకూరు వాసుదేవరెడ్డి, దగుమాటి మధుసూధన్‌రెడ్డి, జనార్థన్‌రెడ్డి, ప్రసాద్, శివ తదితరులు పాల్గొన్నారు.

Back to Top