గిరిజన కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్‌

సోమశిల : అనంతసాగరం మండలం కామిరెడ్డిపాడులో ఇటీవల మరణించిన బాలికలు హరిత, కీర్తిల గిరిజన కుటుంబాన్ని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, జడ్పీచైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిలు పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని వారు తెలిపారు. వారి వెంట వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు ఎం కొండయ్య, ఎద్దుల శ్రీనివాసులరెడ్డి షేక్‌ షబ్బీర్, కేతా రవింద్రారెడ్డి తదితరులు ఉన్నారు.

Back to Top