బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

ఆత్మకూరురూరల్‌ః ఆత్మకూరు మండలం బోయలచిరువెళ్ల గ్రామంలో గత రెండు రోజుల క్రితం పాముకాటుకు గురై మృతి చెందిన మహిళ చంద్రకళ కుటుంబాన్ని బుధవారం ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి పరామర్శించారు. గ్రామానికి బుధవారం చేరుకున్న ఆయన ఆమె భర్త చిలుకూరు శ్రీనివాసరెడ్డిని, పిల్లలను కలసి పరామర్శించి సానుభూతిని తెలియచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాలపాము కాటుకు గురై మృతి చెందిన ఆమెకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకునేలా కృషి చేస్తానని, ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాలు అందిస్తానని ఆయన ఈ సందర్భంగా తెలియచేశారు. ఆయన వెంట వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు రావూరు శ్రీనివాసులరెడ్డి, వెంకటేశ్వర్లురెడ్డి, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

తాజా వీడియోలు

Back to Top