ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతం చేద్దాం


నెల్లూరు: ప్రజాసంకల్ప యాత్ర పేరుతో జనం గుండెచప్పుళ్లను తెలుసుకోవడానికి వస్తున్న వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డికి నియోజకవర్గంలో జనహారతులు పట్టాలని ఆత్మ‌కూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాసంకల్ప పాదయాత్ర నియోజకవర్గంలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో పట్టణంలోని తన నివాసంలో శుక్రవారం పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఫిబ్రవరి మొదటివారంలో నియోజకవర్గంలోని సంగం, ఏఎస్‌పేట మండలాల్లో రెండు రోజుల పాటు ప్రజాసంకల్ప యాత్ర జరగనుందని చెప్పారు. సంగం మండలం జెండాదిబ్బ నుంచి యాత్ర ప్రారంభం కానుందని చెప్పారు. ఏఎస్‌పేటలోని హజరత్‌ ఖాజానాయబ్‌ రసూల్‌ ఆశీస్సులతో ఆ మండలంలోని హసనాపురంలో జిల్లా మైనార్టీలతో బహిరంగసభను నిర్వహించతలపెట్టామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి మహిళలు, యువకులు, కార్యకర్తలు 200 మందికి తగ్గకుండా పాదయాత్రలో వంతుల వారీగా పాల్గొనాలని కోరారు. వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో సుమారు 25 వేల మంది పాల్గొనేలా కార్యాచరణను రూపొందిస్తున్నామని చెప్పారు. రెండు రోజుల పాదయాత్రలో 23 నుంచి 30 కిలోమీటర్ల వరకు నడిచే అవకాశముందని వెల్లడించారు. సంగంలో యాత్ర సందర్భంగా బహిరంగసభ జరగనుందని పేర్కొన్నారు. ప్రజాసంకల్ప యాత్ర జనప్రభంజనమై వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజల్లో ఉన్న ప్రేమానురాగాలకు తార్కాణంగా నిలుస్తోందని చెప్పారు. తొలుత నియోజకవర్గంలోని గ్రామాలు, మండలాల వారీగా ఆయన భేటీలు నిర్వహించి ప్రజాసంకల్పయాత్ర కార్యాచరణపై విస్తృత చర్చలు జరిపారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఇందూరు నారసింహారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మి సిద్దులునాయుడు, జిల్లా ఎస్సీ సెల్‌ అ«ధ్యక్షుడు కొండా వెంకటేశ్వర్లు, జిల్లా అధికార ప్రతినిధి బిజివేముల ఓబుల్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి అంబటి కృష్ణారెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి ఉల్సా పెంచలయ్య, మండల కన్వీనర్లు కంటాబత్తిన రఘునాథరెడ్డి, తూమాటి విజయభాస్కర్‌రెడ్డి, పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, గంగవరపు శ్రీనివాసులునాయుడు, ఏఎస్‌పేట మహిళా కన్వీనర్‌ బోయళ్ల పద్మజారెడ్డి, చేజర్ల మండల ప్రధాన కార్యదర్శి తలపనేని జయంతులునాయుడు, కొమ్మి రమేష్‌నాయుడు, బుట్టి వెంకటసుబ్బారెడ్డి, అంకిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


Back to Top