కేరళ వరద బాధితులకు మేకపాటి రూ.కోటి విరాళం


 
 నెల్లూరు: కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతుగా రూ.కోటి విరాళాన్ని కేఎంసీ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ చైర్మన్, వైయ‌స్ఆర్‌సీపీ ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌ రెడ్డి చెప్పారు. ఈ విరాళాన్ని కేరళ సీఎం సహయనిధికి అందజేయనున్నట్లు  ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28,29 తేదీల్లో స్వయంగా కేరళ వెళ్లి ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కలిసి డీడీని అందజేసి, వరద బాధితుల పునరావసం, ఇతర కార్యక్రమాల కోసం వినియోగించుకోవాలని కోరతారని తెలిపారు. 

Back to Top