ఎల్లోమీడియాపై మేకపాటి ఆగ్రహం

నెల్లూరుః మేకపాటి సోదరులు పార్టీ మారుతారంటూ ఎల్లోమీడియా దుష్ర్పచారం చేస్తోందని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. అధికార కార్యక్రమాల్లో బీజేపీ నేతలను కలవడం సహజమని అన్నారు. అంత మాత్రాన పార్టీ మారుతున్నారని ప్రచారం చేయడం సరికాదన్నారు. అధినేత వైయస్ జగన్ త్వరలో జిల్లాలో పర్యటిస్తారని మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు.

Back to Top