ఎంపీ మేకపాటికి అస్వస్థత


 న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరహార దీక్షకు దిగిన వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి(75) శనివారం తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు దీక్షను విరమించాలని సూచించారు. అయితే, దీక్షను విరమించేందుకు మేకపాటి నిరాకరించారు. ప్రత్యేక హోదాపై ఎట్టిపరిస్థితుల్లో వెనకడుగు వేయనని అన్నారు. కాగా, శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో పెనుగాలులకు ఏపీ భవన్‌లోని దీక్ష శిబిరం కకావికలమైంది. అయినా వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు భవన్‌లో దీక్షను కొనసాగిస్తున్నారు. ఎంపీల దీక్షకు ఢిల్లీలోని పలు తెలుగు సంఘాలు సంఘీభావాన్ని తెలిపాయి.
తాజా వీడియోలు

Back to Top