మేకపాటి ఆసుప‌త్రికి త‌ర‌లింపు

న్యూఢిల్లీ:  ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఎంపీ పదవులకు రాజీనామా చేసి.. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండోరోజుకు చేరుకుంది. ఈ దీక్ష‌లో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, మిథున్‌రెడ్డి, వైయ‌స్‌ అవినాశ్‌ రెడ్డి దీక్ష కొనసాగిస్తున్నారు. వీరిలో మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి అస్వస్థతకు గురైనా లెక్కచేయకుండా మొక్కవోని సంకల్పంతో దీక్షను కొనసాగిస్తున్నారు. అయితే ఢిల్లీ పోలీసులు ఆయ‌న‌ను బ‌ల‌వంతంగా అదుపులోకి తీసుకొని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మేక‌పాటి దీక్ష‌ను భ‌గ్నం చేయ‌డంతో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు దీక్షాస్థ‌లిలో ఆందోళ‌న చేప‌ట్టారు.  

Back to Top