రైల్వే జోన్ దీక్ష‌ను జ‌య‌ప్ర‌దం చేయాలి

అన‌కాప‌ల్లి) విశాఖ‌ప‌ట్నంలో ప్ర‌త్యేక రైల్వే జోన్ కోరుతూ వైఎస్సార్సీపీ విశాఖ అధ్య‌క్షుడు గుడివాడ అమ‌ర్ నాథ్ చేప‌ట్టిన దీక్ష కోసం పార్టీ పరంగా చురుగ్గా స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈ నెల 14న విశాఖ లోని అంబేద్క‌ర్ విగ్ర‌హం ద‌గ్గ‌ర జ‌యంతి వేడుక‌లు నిర్వ‌హించి, అక్క‌డ నుంచి ర్యాలీగా స‌భా స్థ‌లికి రావాల‌ని నిర్ణ‌యించారు. అన‌కాప‌ల్లి లో ఈ దిశ‌గా పార్టీ నాయ‌కులు స‌మావేశం అయ్యారు. నిరాహార దీక్ష కు సంఘీభావం తెలిపే మార్గాల మీద చ‌ర్చించారు. ఈ సందర్భంగా నాయ‌కులు మాట్లాడుతూ... ప్ర‌త్యేక రైల్వే జోన్ డిమాండ్ ను తెలుగుదేశం నాయ‌కులు ఏమాత్రం ప‌ట్టించుకోవ‌టం లేద‌ని విమ‌ర్శించారు. రైల్వే జోన్ ఆవ‌శ్య‌క‌త‌ను మ‌రింత‌గా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని  కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు. పార్టీ నాయ‌కులు జాన‌కి రామ‌రాజు, సూరిబాబు, గాంధీ, జ‌గ‌న్‌, జాజుల ర‌మేష్‌, ర‌త్న‌కుమారి త‌దిత‌రులు పాల్గొన్నారు. 
Back to Top