మీడియా ప్రమాణాలంటే ఇలాగేనా?

హైదరాబాద్, 1 సెప్టెంబర్‌ 2012 : విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించాలని కోరుతూ వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ ప్రజలకు మద్దతుగా చేపట్టిన బంద్ పట్ల కూడా ‌కొన్ని చానళ్ళు వివక్షా పూరితంగా వ్యవహరించటం పట్ల సీనియర్ పాత్రికేయులు, మీడియా రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతుగా కృషి చేయాల్సిన మీడియాలోని ఒక వర్గం ఇలాంటి ధోరణితో వ్యవహరించడం తగదని వారు హితవు పలికారు. మొదటి నుంచీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తమకు బద్ధ శత్రువన్నట్లు వ్యవహరిస్తున్న ఆ వర్గం మీడియా చానళ్లు వ్యవహరించడం సరికాదని ఖండించారు. విద్యుత్ సంక్షోభంపై ఒక ప్రతిపక్ష పార్టీ ఇచ్చిన బం‌ద్ పిలుపును మీడియా ప్రమాణాల ప్రకారం‌ తమ చానళ్ళలో కనీసం ప్రసారం కూడా చేయకపోవడాన్ని వారు విమర్శించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బంద్ పిలుపు ప్రజల వద్దకు వెళ్లకుండా ‌చేయాలన్న ఉద్దేశంతోనే అలా వ్యవహరించాయన్న విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపున శుక్రవారం తెల్లవారీ తెల్లవారక ముందే ఆ టీవీ చానళ్లు బంద్ విఫలం అంటూ ప్రత్యేక కథనాలు ప్రసారం చేయటం మొదలు పెట్టాయి. ‌బస్సులు యధావిధిగా తిరుగుతున్నాయని, కార్యాలయాలు    తెరవక ముందే తెరిచారని కథనాలు అల్లడమే కాకుండా బంద్ ప్రభావం ఏమీ లేదన్నట్లు ప్రజలకు భ్రాంతి కలిగించేందుకు ప్రయత్నించాయి. ‌ఇలాంటి వివక్షా పూరిత ధోరణిని మీడియా రంగ నిపుణులు సైతం తప్పుపడుతున్నారు.

తాజా వీడియోలు

Back to Top