వైఎస్ జగన్ హెల్త్ బులెటిన్

గుంటూరు) ప్ర‌త్యేక హోదా కోసం అప్ర‌తిహ‌తంగా నిరాహార దీక్ష చేస్తున్న ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ శారీర‌కంగా కొంత మేర నీర‌సిస్తున్నారు. గురువారం ఉద‌యం ప‌ది గంటల స‌మ‌యంలో ప్ర‌భుత్వ ఆసుప‌త్రి వైద్యులు ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. జన‌ర‌ల్ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ షేక్ ష‌ర్మిల ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. బీపీ 120/80 ఉండ‌గా, షుగ‌ర్ 91 గా ఉంది. రాత్రి 8.30నిముషాల ప్రాంతంలో మ‌రోసారి వైద్య ప‌రీక్ష‌లు జ‌రిపారు. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ మురళీక్ర‌ష్ణ నాయ‌క‌త్వంలోని టీమ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. బీపీ 130/90ఉండ‌గా, షుగ‌ర్ 85 ఉంది. శారీర‌కంగా కొంత నీర‌సించిన‌ట్లుగా వైఎస్ జ‌గ‌న్ క‌నిపిస్తున్నారు. 
Back to Top