మీడియా పాయింట్‌ను రెండుగా విడదీయాలి

వెలగపూడి: అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యుల తీరు చాలా దారుణంగా తయారైందని ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రైతుల రుణమాఫీపై తప్పుడు లెక్కలు చూపుతూ గొప్పలు చెప్పుకుంటుందని మండిపడ్డారు. ఇప్పటి వరకు రూ. 14 వేల కోట్లు మాత్రమే రుణమాఫీకి కేటాయించి రూ. 25 వేల కోట్లు అంటూ సభలో అబద్దాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రైతు ఆత్మహత్యలు మత్తుమందుల వల్లే జరిగాయంటూ ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అయితే మత్తుమందులను రాష్ట్రంలో ఎందుకు అమ్ముతున్నారంటూ ఎదురుదాడికి దిగారు. సభలో రైతు సమస్యలపై ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక వాయిదా వేసుకొని పారిపోయిందన్నారు. మీడియా పాయింట్‌లో కూడా మాట్లాడేందుకు ప్రతిపక్షానికి స్వేచ్ఛలేకుండా పోయిందన్నారు. అందుకనీ మీడియా పాయింట్‌ను రెండు విభాగాలుగా విడదీస్తే సమస్య లేకుండా పోతుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

Back to Top