తెలంగాణ లో బలపడతాం

సంగారెడ్డి) దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి, పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అభిమానులందరినీ పార్టీలకతీతంగా ఏకం చేసి ఏకతాటిపైకి తెస్తానని మెదక్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షునిగా నూతనంగా నియమితులైన గౌరిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.  జిల్లా అంతటా విస్తృతంగా పర్యటించి పార్టీ బలోపేతానికి, పటిష్టవంతానికి పాటు పడతానన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం ప్రజల తరఫున పోరాటానికి సన్నద్ధమవుతామని చెప్పారు. కాగా జిల్లాలో వందల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం మాత్రం కొద్దిమందికి మాత్రమే పరిహారం అందజేసి మిగతా వారికి మొండిచేయి చూపించిందని విమర్శించారు. రైతులను ఆదుకోవడం కోసం జిల్లాలో వైఎస్‌ఆర్ పార్టీ రాష్ట్ర నాయకురాలు వైఎస్ షర్మిల త్వరలో జిల్లాలో రైతు పరామర్శ యాత్ర నిర్వహిస్తారని చెప్పారు. 
Back to Top