మేడే వేడుక‌ల్లో వైయ‌స్ జ‌గ‌న్‌

కృష్ణా జిల్లా:  కార్మికుల దినోత్స‌వం సంద‌ర్భంగా మేడే వేడుక‌లు వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. కృష్ణా జిల్లా పెడ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ద్వారా పాద‌యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ జెండాను ఆవిష్క‌రించి కార్మికుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో కార్మికుల‌కు అన్ని విధాల మేలు జ‌రిగింద‌ని, వైయ‌స్ఆర్‌సీపీ ఆవిర్భావం నుంచి కూడా కార్మికుల సంక్షేమం కోసం పాటుప‌డుతుంద‌న్నారు. వైయ‌స్ఆర్‌సీపీ కార్మికుల‌కు అండ‌గా ఉంటుంద‌ని వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు. 
Back to Top