రాష్ట్ర వ్యాప్తంగా మేడే వేడుక‌లు

హైద‌రాబాద్‌) రాష్ట్ర వ్యాప్తంగా మేడే ఉత్స‌వాలు ఘ‌నంగా జ‌రిగాయి. వివిధ జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వ‌ర్యంలో వేడుక‌లు నిర్వ‌హించారు. పార్టీ కార్యాల‌యాల్లో వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియ‌న్ జెండాల్ని ఆవిష్క‌రించారు. కొన్ని చోట్ల కార్మిక సంఘాల నేతల్ని స‌త్క‌రించారు. కార్మిక ఐక్య‌త కోసం పోరాడుదామ‌ని నాయ‌కులు పిలుపు ఇచ్చారు. శ్రీకాకుళంలోని పార్టీ కార్యాల‌యంలో జెండా ఆవిష్క‌ర‌ణ జ‌రిగింది. అనంత‌రం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వ‌హించారు. 
Back to Top