మత్స్యకార కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ భరోసా

తూర్పు గోదావరి: చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు బతికి
ఉన్నారో లేదో తెలియక దుఃఖసాగరంలో ఉన్న బాధిత కుటుంబాలకు అండగా మేమున్నామంటూ వైఎస్సార్‌సీపీ
నేతలు భరోసా కల్పించారు. తూర్పు గోదావరి జిల్లా 
తుని, పిఠాపురం నియోజకవర్గాలకు 
చెందిన మత్స్యకారుల కుటుంబాలకు  పార్టీ
జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీ  పిల్లి సుభాష్ చంద్రబోస్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే
పెండెం దొరబాబులు పరామర్శించారు. వేటకు వెళ్లి జాడలేని మత్స్యకారులను గుర్తించడంలో
ప్రభుత్వం విఫలమైందని జ్యోతుల నెహ్రూ విమర్శించారు. అధైర్య పడవద్దని, గల్లంతైన వారిని వెతికించేందుకు తాము ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని పేర్కొన్నారు. 
Back to Top