4న షర్మిల పాదయాత్ర ముగింపు సభ

హైదరాబాద్ 01 జూలై 2013:

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఈనెల నాలుగో తేదీన భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురాం వెల్లడించారు. అక్టోబర్ 18న ఇడుపులపాయలో మొదలైన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఆరోజున ఇచ్చాపురంలో ముగుస్తుందన్నారు. ఈ సందర్భంగాన్ని పురస్కరించుకుని ఈ సభను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. యాత్ర ఇప్పటికే ముగియాల్సి ఉన్నప్పటికీ, అటవీ ప్రాంతంలోని ఆదివాసీలను కలిసి వారికి భరోసా కల్పించాలన్న శ్రీమతి షర్మిల పట్టుదల కారణంగా యాత్ర మార్గాన్ని మార్చినట్లు ఆయన వివరించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ చేపట్టిన ప్రజా ప్రస్థానం ముగింపు వేదిక 'విజయ వాటిక'కు శ్రీమతి షర్మిల ఆదివారం చేరుకుంటారని చెప్పారు. మధ్యాహ్నం ఒంటి గంటకు భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారని తెలిపారు. అంతకుముందు ఆమె మరో ప్రజా ప్రస్థానం ముగింపు సందర్భంగా ఏర్పాటుచేసిన 'విజయ ప్రస్థానం' చిహ్నాన్ని ఆవిష్కరించి, పాదయాత్రను ముగిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని రఘురాం పిలుపునిచ్చారు.

తాజా ఫోటోలు

Back to Top