మార్షల్స్ దాడి హేయనీయం

హైదరాబాద్ : ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టాలంటూ పోడియంను చుట్టు ముట్టిన వైయస్ఆర్ సీపీ సభ్యులపై మార్షల్స్‌ అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రతిపక్ష సభ్యులపై దౌర్జన్యం చేశారు. స్పీకర్ పోడియం వద్ద ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేస్తుండగా ప్రతిపక్ష సభ్యులను లాగిపడేసే ప్రయత్నం చేశారు. దీంతో మార్షల్ తీరును సభ్యులు తీవ్రంగా ప్రతిఘటించారు.

ఈ సమయంలో ఇద్దరి మధ్య తీవ్ర తోపులాట జరిగింది.  పోడియం వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై మార్షల్స్‌ అకారణంగా దాడి చేశారని వైయస్ఆర్ సీపీ సభ్యులు అన్నారు. తాము స్పీకర్పై దాడికి యత్నించలేదని, అయితే స్పీకర్ దగ్గర మార్షల్స్ను పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈ చర్య శాసనసభ్యులను అగౌరపరిచేలా ఉందన్నారు.

Back to Top