ప్రత్యేకహోదా వదిలేసి ప్యాకేజీలా..!

గుంటూరు: ఎన్నికలకు ముందు ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి...అధికారంలోకి వచ్చాక ప్యాకేజీల గురించి మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసి రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే స్వయం సమృద్ది సాధిస్తుందన్న ఉద్దేశంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారని మర్రి రాజశేఖర్ తెలిపారు. వై ఎస్ జగన్ చేపట్టిన దీక్షకు ప్రజలందరూ మద్దతుగా నిలువాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, అడ్డంకులు సృష్టించినా ప్రత్యేకహోదా కోసం వైఎస్ జగన్ పోరాటం ఆగదని రాజశేఖర్ ధీమా వ్యక్తం చేశారు.

తాజా ఫోటోలు

Back to Top