ధూళిపాళ్ల డైరెక్షన్..పోలీసుల యాక్షన్

గుంటూరుః
పొన్నూరు పట్టణంలో సీఐ, పోలీసుల తీరు దారుణంగా ఉందని వైఎస్సార్సీపీ
గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మండిపడ్డారు. స్థానిక టీడీపీ
ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఏం చెబితే అది చేస్తూ పోలీసులు ఇష్టారాజ్యంగా
వ్యవహరిస్తున్నారని అన్నారు. వడ్డిముక్కల గ్రామానికి చెందిన నాగభూషణం అనే
వ్యక్తిని కేబులు వివాదం ఉందని చెప్పి తీసుకెళ్లి పోలీసులు ఘోరంగా
హింసించారన్నారు. నరేంద్ర చెప్పినట్లు వినాలంటూ  పోలీసులు అతనిపై అక్రంగా
కేసులు బనాయించి, స్టేషన్ లో నిర్బంధించి ...బూట్లతో తన్ని దుర్మార్గంగా
ప్రవర్తించారన్నారు. ఈవిషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు
రాజశేఖర్ చెప్పారు. 

అధికారపార్టీకి
వత్తాసు పలుకుతూ, నరేంద్ర చెప్పినట్లు ఆడుతూ పోలీసులు చట్టాలను
కాలరాస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  మున్సిపల్
కమిషనర్, ఎలక్ట్రికల్ డిపార్ట్ మెంట్ అంతా అక్కడ ఏకపక్షంగా
వ్యవహరిస్తోందన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతూ
చిత్రహింసలకు గురిచేస్తున్నారన్నారు. పోలీసులను ఉసిగొల్పి వైఎస్సార్సీపీ
నాయకుల ఇళ్లపై నరేంద్ర దాడులు చేయిస్తున్నారన్నారు. నాగభూషణంపై దాడికి
పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఈసందర్భంగా నేతలు ఎస్సీని కోరారు. 
Back to Top