తవ్వినకొద్దీ బయటపడుతున్న టీడీపీ భూకుంభకోణాలు

అమరావతిః రాజధానిలో టీడీపీ భూకుంభకోణాలు తవ్వినకొద్దీ కోకొల్లలుగా బయటపడుతున్నాయి. పేదల నోట్లో మట్టి గొట్టి చంద్రబాబు అండ్ కో సాగించిన భూ ఆక్రమణ దురాగతం...దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. రైతుల భూములు, దళితులకు సంబంధించిన అసైన్డ్ భూములను వేటినీ పచ్చదండు వదిలిపెట్టలేదు సరి కదా. 


చంద్రబాబు సారథ్యంలో ఆయన తనయడు లోకేష్ ,మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ...రాజధాని ముసుగులో పేదలను మోసగించి  25 వేలకు పైగా ఎకరాలను అప్పనంగా మింగేసిన ఘటన దేశాన్ని ఓ కుదుపు కుదిపేస్తోంది. 

ప్రపంచస్థాయి రాజధాని పేరుతో ప్రపంచస్థాయి దోపిడీకి పాల్పడిన చంద్రబాబు అవినీతి సునామీని చూసి యావత్ దేశం ఖంగుతింది. బాబు బినామీల భూకుంభకోణాలు చూసి ముక్కున వేలేసుకుంది.
Back to Top