నీవు చేస్తున్నదేంది బాబు

అచ్చంపేటః తెలంగాణాలో చెలసాని శ్రీనివాస్‌యాదవ్‌ టీఆర్‌ఎస్‌లో చేరడాన్ని తీవ్రంగా తప్పుపట్టావ్‌.. ఒక పార్టీలో గెలిచి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీలో మంత్రి కావడాన్ని వ్యభిచారంతో పోల్చావ్‌... ఎపీలో నీవు చేసిందాన్ని ఏమంటారు... వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో, ఫ్యానుగుర్తుపై గెలిచిన నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకున్నావ్‌.. దీన్ని సంపారం అంటారా? నీవు చేస్తే ఒప్పు, ఇంకొకళ్లు చేస్తే తప్పు అవుతుందా... నూతన రాజధానిలో ప్రజా స్వామ్యాన్ని ఖూనీచేశావ్‌ చంద్రబాబూ... అని పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి శివనాగమనోహర నాయుడు అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిజంగా నీవు ప్రజా స్వామ్యవిలువలు కలవాడివైతే ఆ నలుగురిచేత వెంటనే రాజీనామాలు చేయించి నీపార్టీ గుర్తుపై గెలిపించుకోవాలన్నారు. ఇప్పటికీ నీ పార్టీలో చేరిన 21మంది ఎమ్మెల్యేలు వైఎస్సార్‌ పార్టీ వారేనని స్పీకర్‌ స్పష్టం చేసిన విషయం నీకు తెలియదా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రిపదవి ఇచ్చిన నీకు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా అని ప్రశ్నించారు. ఏ ముఖ్యమంత్రి చేయని తప్ప చంద్రబాబు చేశాడని ఆరోపించారు. ఎంతో అనుభవం ఉండి 5,6 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన సీనియర్స్‌ని కాదని దొడ్డిదారిలో ఎమ్మెల్సీ అయిన లోకేష్‌కు ఏ హోదాతో మంత్రి పదవులిచ్చావో ప్రజలకు చెప్పే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. ఎంతో వెనుకబడి ఉన్న గిరిజనులకు మంత్రి వర్గంలో స్థానం కల్పించక పోవడం శోచనీయమన్నారు.
అర్హులకు పెన్షన్‌లు నిలిపివేశారు
Back to Top