రైల్వే జోన్ కోసం అమ్మ‌వారికి 501 టెంకాయ‌లు

పాతపోస్టాఫీసు: ప్రత్యేక రైల్వేజోన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ 21వ వార్డు వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు దశమంతుల మాణిక్యాలరావు  మరిడిమాంబ ఆలయంలో 501 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ చేపట్టిన ఆత్మగౌరవ యాత్రకు ప్రజలు అండగా ఉన్నారని, జోన్‌ సాధనే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ప్రజలకు అవగాహన కల్పిస్తూ పనిచేస్తున్నారని కోరారు. హామీలను నెరవేర్చని బీజేపీ, టీడీపీలకు జీవీఎంసీ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని, ఈ రెండు పార్టీలు అవలంబిస్తున్న ద్వంద్వ‌ వైఖరి వల్ల ఎంతోకాలం కలసి మనుగడ సాగించలేవని చెప్పారు. ప్రత్యేక పూజల్లో పార్టీ కార్యకర్తలు దశమంతుల సీత, ఆది, భువనేశ్వరి, గురునాథ్, రమేష్, కృష్ణప్రసాద్, మాలతి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Back to Top