మంగళవారం షర్మిల పాదయాత్ర సాగుతుందిలా...

ఆదోని 13 నవంబర్ 2012 : షర్మిల 27 వ రోజు పాదయాత్ర మంగళవారం ఆదోని సమీపంలోని మిల్టన్ స్కూల్ నుంచి ప్రారంభమై కొత్త బస్టాండ్, నిర్మల టాకీస్ రోడ్, వీబీఎస్ సర్కిల్, శ్రీనివాస భవన్ సర్కిల్ మీదుగా ఏరియా హాస్పిటల్ చేరుకుంటుంది. మధ్యాహ్నభోజన విరామానంతరం పాదయాత్ర చత్తా బజార్ రోడ్, పీఎన్ రోడ్, జామియా మసీద్, పూల్ బజార్, గణేష్ సర్కిల్, మీటర్ మజీద్ రోడ్డు, అవన్నపేట స్కూల్, ఎమ్మిగనూరు రోడ్డుకు చేరుకుంటుంది. రాత్రి అక్కడ బస ఉంటుంది. మంగళవారం ఆదోని పరిసర ప్రాంతాలలో 9.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుంది. షర్మిల 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్రకు అపూర్వ స్పందన వస్తున్నందున ఆదోనిలో మరింత విస్తృతంగా పాదయాత్ర నిర్వహిస్తున్నామని వైయస్ఆర్ సీపీ ప్రోగ్రాం కన్వీనర్ తలశిల రఘురాం, కర్నూలు జిల్లా పార్టీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి మీడియాకు తెలిపారు.
Back to Top