మంగళ వారం నుంచి వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర

అనంతపురం :  అనంత పురం జిల్లాలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మూడో విడత రైతు భరోసా యాత్ర చేయనున్నారు. రాష్ట్రంలో రైతులంతా ఆనందంగా ఉన్నారని, సమస్యలే లేవని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా బుకాయించింది. దీని మీద స్పందించిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, సమస్యల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని సభ దృష్టికి తీసుకొని వచ్చారు. తన కూడా వస్తే రైతు ఆత్మహత్యలు చేసుకొంటున్న కుటుంబాల్ని చూపిస్తానని సవాల్ విసిరారు. అన్న మాట ప్రకారం అసెంబ్లీ సమావేశాల తర్వాత వైఎస్ జగన్ అనంతపురం జిల్లాలో ఆత్మహత్యలు చేసుకొన్న రైతు కుటుంబాల్ని పరామర్శించి వచ్చారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా రైతు కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. అంతే కానీ, రైతుల సమస్యల్ని తీర్చేందుకు ఏమాత్రం ప్రయత్నించలేదు.
ఇప్పటికే రెండు విడతలుగా రైతు భరోసా యాత్ర చేసిన వైఎస్ జగన్, మూడో విడతగా అనంతపురం జిల్లా లో పర్యటిస్తున్నారు. మంగళవారం నాడు కళ్యాణ దుర్గం నియోజక వర్గంలోని శెట్టూరు నుంచి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం అక్కడ ఒక బహిరంగ సభ నిర్వహిస్తారు. అక్కడ ఒక కార్యకర్త కుటుంబాన్ని పలకరిస్తారు. బుధవారం నాడు  కైరేవు గ్రామంలోని ఒక రైతు కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత కళ్యాణదుర్గం మండలంలోని ముదిగళ్లు, వర్లి గ్రామాల్లోని రైతు కుటుబాలకు భరోసా కల్పిస్తారు. తర్వాత గురువారం నాడు కళ్యాణదుర్గం నియోజక వర్గంలోని కంబదూరు మండలం తిమ్మాపురం, వంటారెడ్డిపాలెం లో రైతు భరోసా యాత్ర నిర్వహిస్తారు.


Back to Top