మంగళగిరిలో రైతులకు ఆర్కే భరోసా

మంగళగిరి : గుంటూరు జిల్లా మంగళగిరి వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామ‌కృష్ణారెడ్డి భూసేకరణ విషయమై రైతులకు భరోసా కల్పించారు. మండలంలోని బేతపూడి గ్రామంలో ఆదివారం ఆయన రైతులతో సమావేశమయ్యారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం భూమిని సేకరించలేదన్నారు. మూడు పంటలు పండే భూమిని సేకరించరాదని చట్టంలో మొదట్లోనే పేర్కొన్నారని ఆర్కే వివ‌రించారు. ఈ విషయంలో ఆందోళన చెందవద్దని ఆయన రైతులకు సూచించారు. తాను అండగా ఉంటానంటూ ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. 

Back to Top