ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్టుకు నిరసనగా మండలమీట్‌ వాయిదా

ఎర్రావారిపాళెం(భాకరాపేట): పేదల పక్షాన నిలబడి పోరాటంలో పాల్గొన్నందుకు అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసస్తూ మండల సర్వ సభ్య సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎర్రావారిపాళెం ఎంపీపీ రేవతీరెడ్డెప్పరెడ్డి ప్రకటించారు. శనివారం ఉదయం ఎర్రావారిపాళెం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ రేవతీరెడ్డెప్పరెడ్డి అధ్యక్షతన ప్రారంభమయింది. అయితే వెంటనే ఎంపీపీ మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం సీ.రామాపురం వద్ద డంపింగ్‌ యార్డుతో అక్కడి ప్రజల ప్రజారోగ్యానికి పెనుముప్పు ఏర్పడుతుందని ప్రజలతో కలసి పోరాటాలనికి దిగిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మండల సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేస్నుట్లు ప్రకటించారు. దీంతో సమావేశానికి వచ్చిన అధికారులు, ప్రజా ప్రతినిధులు సర్వ సభ్య సమావేశం నుంచి బయటికి వచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యేను అరెస్టు చేసి అనేక సెక్షన్లు పెట్టడడం చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని అనుమానం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మహేశ్వరరెడ్డి, సర్పంచ్‌ రెడ్డెప్పరెడ్డి, చంగల్‌రెడ్డి, రమేష్, వైఎస్సార్‌సీపీ మండల పార్టీ అధ్యక్షుడు నాగార్జునరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top