28న మండ‌ల స్థాయి స‌మావేశం

పిట్టలవానిపాలెం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండ‌ల స్థాయి స‌మావేశం ఈనెల 28వ తేదిన చందోలులో నిర్వ‌హించ‌నున్న‌ట్లు పార్టీ క‌న్విన‌ర్, చందోలు ఎంపీటీసీ స‌భ్యులు షేక్‌బాజీ బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. పార్టీని మండ‌ల స్థాయిలో బ‌లోపేతం చేసేందుకు కార్యకర్తల సమావేశం నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. సమావేశానికి బాపట్ల శాసన సభ్యులు కోన రఘుపతి పాల్గొంటారని తెలిపారు. మండలంలోని వైయ‌స్సార్‌ సీపీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Back to Top