చంద్రబాబు చీటర్

విశాఖపట్టణం:  ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చంద్రబాబుపై  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు పెద్ద చీటర్, మోసగాడని మండిపడ్డారు. కాపుల రిజర్వేషన్ల అంశం చంద్రబాబు చేతుల్లోనే ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణపై ఈ నెల 5న అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే సీఎం స్వగ్రామం నారావారిపల్లె నుంచి మార్చి 10న విశ్వరూప చైతన్య యాత్ర ప్రారంభిస్తామన్నారు. మార్చి 30 తర్వాత 10 లక్షల మందితో విజయవాడలో భారీ సభ చేపడతామని చెప్పారు.

Back to Top