మంగపేట నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం

మంగపేట (ఖమ్మం జిల్లా), 5 మే 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినే శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 139వ రోజు ఆదివారం ఉదయం ఖమ్మం జిల్లా మంగపేట నుంచి ప్రారంభమైంది. వైయస్ అభిమానులు,‌ పార్టీ శ్రేణలు శ్రీమతి షర్మిల వెంట విశేష సంఖ్యలో నడుస్తున్నారు. ఈ రోజు మంగపేట తండా క్రాస్‌రోడ్, బృందావనం, హౌ‌సింగ్ బోర్డు కాలనీ వరకూ పాదయాత్ర చేస్తారు. అక్కడ శ్రీమతి షర్మిల మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు.

అనంతరం ఆమె విద్యానగ‌ర్ కాలనీ, ఎన్‌కె నగర్, పోస్టాఫీ‌స్ సెంట‌ర్, బస్టాండ్ సెంట‌ర్, రైల్వే స్టేష‌న్ వరకూ నడుస్తారు. రైల్వే స్టేషన్‌ సమీపంలో బహిరంగ సభలో శ్రీమతి షర్మిల అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభ అనంతరం శ్రీమతి షర్మిల మార్కె‌ట్ సెంట‌ర్, పాత డిపో, భజన మంది‌రం వరకు నడుస్తారు. భజన మందిరం సమీపంలో ఏర్పాటు చేసిన రాత్రి బసకు ఆమె చేరుకుంటారు. కాగా, శ్రీమతి షర్మిల ఆదివారం మొత్తం 10.2 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారని పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం తెలిపారు.
Back to Top