మంగళవారం నాటి పాదయాత్ర 14.5కి.మీ

రామచంద్రాపురం, 11 జూన్ 2013: మరో ప్రజాప్రస్థానం భాగంగా దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర 176వ రోజుకు చేరుకుంది. మంగళవారం ఉదయం ఆమె రామచంద్రపురం రాజగోపాల్ సెంటర్ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి చోడవరం, నర్సారావు పేట, వెండ్రక్రాస్, గండ్రేడు లంక మీదుగా జి.మామిడాడ వరకు నడుస్తాస్తారు. ఇక్కడ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం రాత్రికి జి.మామిడాడలో బస చేస్తారు. మొత్తమ్మీద శ్రీమతి షర్మిల ఇవాళ 14.5 కిలో మీటర్లు నడవనున్నారు.
Back to Top