మంచుకొండ నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం

మంచుకొండ (ఖమ్మం జిల్లా), 28 ఏప్రిల్‌ 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ‌అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 134వ రోజు ఆదివారం ఉదయం మంచుకొండ నుంచి ప్రారంభమైంది. శ్రీమతి షర్మిల ఈ రోజు ఖమ్మం అర్బన్ మండలం మంచుకొండ, బూడిదంపాడు, రాంరెడ్డినగ‌ర్, కామేపల్లి మండలం పండితాపురం, ముచ్చెర్ల క్రా‌స్ రో‌డ్‌ మీదుగా ముచ్చెర్ల వరకు పాదయాత్ర చేస్తారని పార్టీ కార్యక్రమాల కమిటీ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం తెలిపారు. ఆదివారం రాత్రికి ఆమె ముచ్చెర్ల వద్ద ఏర్పాటు చేసే శిబిరంలో బస చేస్తారని వివరించారు. కాగా, శ్రీమతి షర్మిల ఆదివారం నాడు మొత్తం 13.4 కిలోమీటర్లు నడుస్తారు.
Back to Top