బాబు పాల‌న‌లో విద్యా వ్యవస్థ నిర్వీర్యం

గాంధీనగర్‌:

చంద్రబాబు పాల‌న‌లో ప్రభుత్వం విద్యావ్యవస్థ నిర్వీర్యం అయ్యింద‌ని  వైయ‌స్ఆర్‌సీపీ విజ‌య‌వాడ నగర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లాది విష్ణు మండిప‌డ్డారు. కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయంలో వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ విద్యావ్యవస్థను ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేశారని ధ్వ‌జ‌మెత్తారు. దివంగత ముఖ్యమంతి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి హయంలో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి తూట్లు పొడిచారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కుదించి విద్యార్థులను మోసం చేశారన్నారు. విద్యార్థులకు చంద్రబాబు చేసిన ద్రోహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన గురుతర బాధ్యత విద్యార్థి విభాగంపై ఉందన్నారు. విద్యార్థి విభాగం ప్రత్యేక ఎజెండా రూపొందించుకుని అహర్నిశలు పనిచేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు భరోసా కల్పించేందుకు విద్యార్థి విభాగం సమర్థంగా పనిచేయాలని కోరారు. రాబోయే రోజుల్లో విద్యార్థులకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అండగా నిలుస్తుందన్నారు. అనంతరం విద్యార్థులకు సభ్యత్వం ఇచ్చారు.  కార్యక్రమంలో విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు డి. అంజిరెడ్డి, నగర ప్రధాన కార్యదర్శి బాలనారాయణ్‌ యాదవ్, కార్యదర్శి అర్జున్, మనోజ్‌కుమార్, సురేంద్ర, హసన్, రాజేష్, సుందర్, శ్యామ్, ప్రసాద్, చందు, విజయ, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top