జన్మభూమితో ప్రజలకు ఒరిగేదేమి లేదు

విజయవాడ:  చంద్రబాబు ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమంతో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని వైయస్‌ఆర్‌సీపీ నేత మల్లాది విష్ణు అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాత అర్జీలకు పరిష్కారం చూపకుండా జన్మభూమి కార్యక్రమాన్ని మళ్లీ నిర్వహించిన చంద్రబాబు మత్య్సకారులను తిట్టారన్నారు. పులివెందుల గ్రామ సభలో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డిని మాట్లాడకుండా మైక్‌ గుంజుకున్నారని ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు సంక్షేమం–అభివృద్ధి అని గొప్పలు చెప్పారని, ప్రజలు ఎవరైనా సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధిపై ఓ శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా అన్నారు. ఆనందం–ఆరోగ్యం అంటున్నారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా చేశారు. 108కు ఇవాళ డీజిల్‌ పోసే నాథుడు లేడన్నారు. విద్యా–వికాసం అంటున్నారు. జన్మభూమి, సత్యనాదేళ్లకు సంబంధం ఏంటని నిలదీశారు. ఇసుక, మట్టి, బొగ్గు, మద్యం ఇలా ప్రతిదాంట్లో అవినీతికి పాల్పడ్డారన్నారు. కుంభకోణాలు చేసిన ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డిని జన్మభూమి సభలో పక్కన కూర్చోబెట్టుకోని నీతులు చెబుతారా అనిమండిపడ్డారు. రైతులకు ఏ మాత్రం గిట్టుబాటు ధర లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రలో ప్రశ్నిస్తే కోల్డు చైన్‌ అని తెరపైకి తెచ్చారన్నారు. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలే అని విమర్శించారు.
 

తాజా వీడియోలు

Back to Top