కేశ‌వ‌రెడ్డి బాధితుల‌కు అండ‌గా ఉంటాం

నంద్యాల‌:  మంత్రి ఆదినారాయణరెడ్డి బెదిరింపులకు కేశవరెడ్డి బాధితులు భయపడబోరని, వారికి అండ‌గా ఉంటామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యులు మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. 2015 నుంచి నంద్యాల ఎన్‌జీఓ కాలనీలోని కేశవరెడ్డి పాఠశాల నిధులు ఏమవుతున్నాయో అంతుపట్టడం లేదన్నారు. విద్యార్థుల ఫీజులు, అడ్మిషన్ల ద్వారా పాఠశాలకు రూ.70కోట్లకుపైగా సమకూరిందని, ఆ డబ్బును ఎక్కడికి మళ్లిస్తున్నారో బాధితులకు చెప్పాలన్నారు. ఇందుకు సంబంధించి బాధితులు వెళ్లి ప్రశ్నిస్తే కేశవరెడ్డి వియ్యంకు డు, మంత్రి ఆదినారాయణరెడ్డి తన అనుచరులను నంద్యాలకు పంపి భయపెట్టాలని ప్రయత్నించారన్నారు.  

తాజా ఫోటోలు

Back to Top