వైయస్‌ జగన్ ను సీఎం చేయడమే లక్ష్యం

నందలూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఏపీ ముఖ్యమంత్రి చేయడమే తమ లక్ష్యమని వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె గ్రీశ్మంత్‌రెడ్డి అన్నారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలు కొనసాగాలన్నా.. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు అందాలన్నా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమవుతుందని తెలిపారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరాట పటిమ  ఆదర్శనీయమన్నారు. రాష్ట్ర ప్రతిపక్షనేతగా ప్రజల పక్షాన ఆయన చేస్తున్న పోరాటాలు అభినందనీయమన్నారు. 

బడుగు, బలహీనవర్గాలు, రైతుల పక్షాన పోరాడుతున్నారని అందుకే ఆయనంటే ప్రజలకు అంత అభిమానమని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకంతో జనజీవనం స్తంభించిపోతుందని, వైయస్‌ జగన్‌ లాంటి నాయకుడు ముఖ్యమంత్రి అయితే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని గ్రీశ్మంత్‌రెడ్డి ఆశాభావం వ్యక్తంచేశాడు. వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సైనికుల్లా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు మున్ముందు వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగంలో నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు షేక్‌ మహబూబ్‌భాష, ఆణాల మధుయాదవ్, పుత్తా శంకర్‌లు పాల్గొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top