2న జరిగే వైయస్సార్సీపీ జిల్లా ప్లీనరీ జయప్రదం చేయండి

ఎంపీటీసీల సన్మాన సభలో ప్రసన్నకుమార్‌రెడ్డి పిలుపు
కొడవలూరు: వచ్చే నెల 2న నెల్లూరు అనీల్‌ గార్డన్స్‌లో జరుగు వైయస్సార్సీపీ జిల్లా ప్లీనరీ సమావేశాన్ని జయప్రదం చేయాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. నార్తురాజుపాలెంలోని వీసీఆర్‌ అతిధిగృహంలో నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులకు మంగళవారం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీపీ నల్లావుల వెంకమ్మ, వైస్‌ ఎంపీపీ కొండా శ్రీనివాసులురెడ్డి, ఎంపీటీసీలు నీలకంఠం పద్మజ, కుడుముల జాలమ్మ, వీరి రమణమ్మ, మందపల్లి మల్లికార్జున, జక్కల శ్రీనివాసులు, ఎందోటి శ్రీనివాసులు తదితర ఎంపీటీసీ సభ్యులకు శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 16న జరిగిన నియోజకవర్గ ప్లీనరీని ఊహించిన వానికంటే మిక్కిలిగా విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 2న జరిగే జిల్లా ప్లీనరీకి కూడా ఇదే స్ధాయిలో నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు, మండల కన్వీనర్లు గంధం వెంకటశేషయ్య, మావులూరి శ్రీనివాసులురెడ్డి, టంగుటూరి మల్లికార్జునరెడ్డి, బెజవాడ గోవర్ధన్‌రెడ్డి, జిల్లా నాయకువలు దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబురెడ్డి, నాపా వెంకటేశ్వర్లునాయుడు, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, బాలశంకర్‌రెడ్డి, పెనాక శ్రీనివాసులురెడ్డి, విజయకుమార్, నాయకులు నాగిరెడ్డి రమేష్, నల్లావుల శ్రీనివాసులు, నీలకంఠం శ్రీధర్‌రెడ్డి, కరిముల్లా, రంగారెడ్డి, సునీల్‌రెడ్డి, రాజేష్‌రెడ్డి, పిట్టి సూర్యనారాయణ, మాతూరు శ్రీనివాసులురెడ్డి, ఏ.వెంకటరత్నం, తిరుపతమ్మ, అహరోన్‌లు పాల్గొన్నారు.
Back to Top