భక్తులను సురక్షితంగా నది దాటించండి

కర్నూలు: తెలంగాణ రాష్ట్రంలోని సింగోటం జాతరకు వెళ్లే భక్తులను సురక్షితంగా కృష్ణా నది దాటించాలని నందికొట్కూర్‌ ఎమ్మెల్యే ఐజయ్య అధికారులు, పోలీసులను ఆదేశించారు. సోమవారం ఎమ్మెల్యే కృష్ణానది ఒడ్డున ఏర్పాటు చేసిన ఇంజన్‌ బోట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..2007లో జరిగిన పుట్టి ప్రమాద సంఘటనను దృష్టిలో పెట్టుకొని తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 17న జరిగే రథోత్సవ వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఇంజన్‌బోట్లలో సింగోటం తరలి వెళ్తుంటారన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఇంజన్‌బోట్లను నడిపే డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఘాట్ల వద్ద భక్తులకు తాగునీరు, నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఉన్నారు.

Back to Top