రోజాకు సుప్రీంకోర్టులో ఊరట

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌.కె. రోజాకు ఊర‌ట‌ లభించింది. రోజా పిటిష‌న్ పై విచారించాలంటూ హైకోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది. హైకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్ర‌ర్ వ్య‌వ‌హరించిన తీరుపై సుప్రీం కోర్టు ఆగ్ర‌హం వ్యక్తం చేసింది. అసిస్టెంట్ రిజిస్ట్రర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంటుంద‌ని వ్యాఖ్య‌ానించింది.

రేపు ఉద‌యం  రోజా పిటిష‌న్‌పై విచార‌ణ జ‌ర‌పాల‌ని హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాల‌ను ఈ-మెయిల్‌లో హైకోర్టుకు పంపుతున్నట్లు...జ‌స్టిస్ గోపాల‌గౌడ, జ‌స్టిస్ అరుణ్‌మిశ్రాల‌తో కూడిన బెంచ్ ప్రకటించింది. 
Back to Top