'మైనార్టీలంతా వైయస్ఆర్‌ కాంగ్రెస్ పక్షమే'

కోదాడ:

రాష్ట్రంలోని మైనార్టీలంతా శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డికి మద్దతుగా వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారని ఆ పార్టీ మైనారిటీ విభాగం జిల్లా కన్వీనర్ సలీం చెప్పారు. నల్గొండ జిల్లాలో ఆ పార్టీ మైనారిటీ సెల్ మున్సిపల్ పట్టణాల, మండలాల కన్వీనర్‌లు, ప్రధాన కార్యదర్శుల నియామకంలో భాగంగా ఆయన కోదాడకు వచ్చారు. ఈ సందర్భంగా  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ షర్మిల పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో మైనారిటీలు ఘన స్వాగతం పలకాలని కోరారు. పార్టీ జిల్లా మైనారిటీ  సెల్ నాయకుడు కాశీం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అవతరించాక దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ పాలనలోనే మైనారిటీలకు మేలు ఒనగూరిందన్నారు. తాను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో డాక్టర్ వైయస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీతో గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్నానని వెల్లడించారు. చంద్రబాబు అద్దంలో మిఠా యి చూపి తినమంటారనీ, డాక్టర్ వైయస్ఆర్ అయితే మిఠాయి చేతిలో పెడతారని తెలిపారు.

Back to Top