పొగాకు రైతులు అడుగుతున్న‌దేమంటే..

జంగారెడ్డి గూడెం) ప్ర‌తిప‌క్ష నేత, వైయస్సార్సీపీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ ప‌శ్చిమగోదావ‌రి జిల్లా ఏజ‌న్సీ కు వ‌స్తున్నారు. అక్క‌డ పొగాకు రైతుల స‌మ‌స్య‌ల మీద మ‌రింత‌గా దృష్టి సారిస్తున్నారు. రైతుల పోరాటానికి మ‌ద్దతుగా నిల‌వ‌నున్నారు. దీంతో అక్క‌డ రైతుల ఆవేదన ప్ర‌ధాన అంశంగా నిలుస్తోంది. పొగాకు రైతుల్ని ఆదుకోవ‌టంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌లం అయింద‌ని రైతులు అంటున్నారు. గిట్టుబాటు ధ‌ర‌లేక‌, ప్ర‌భుత్వం నుంచి మ‌ద్ద‌తు లేక ఇబ్బందులు ప‌డుతున్నట్లు చెబుతున్నారు. రైతుల ఆవేద‌న వారి మాటల్లోనే..

వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్తాం....
పొగాకు కేజీ ధ‌ర రూ. 120 నుంచి రూ. 130 ఇస్తున్నారు. వాస్త‌వంగా కేజీ పొగాకు ధ‌ర రూ. 160 నుంచి రూ. 180 ఇస్తేనే మాకు మ‌ద్ద‌తు ధ‌ర‌. ఎరువుల ధ‌ర‌లు సైతం పెరిగిపోయాయి. పొగాకుకు గిట్టుబాటు ధ‌ర క‌ల్పిస్తేనే రైతులు అప్పుల ఊబి నుంచి బ‌య‌ట‌ప‌డ‌తాం. గ‌తేడాదికి ఈ యేడాదికి దిగుబ‌డి త‌గ్గిపోయింది. ఈ యేడు 25 క్వింటాళ్ల పొగాకు వ‌చ్చిన గిట్టుబాటు ధ‌ర మాత్రం అంతంత మాత్ర‌మే ఉంది. ప్ర‌భుత్వం ఇలా గిట్టుబాటు ధ‌ర ఇవ్వ‌క‌పోతే మేము పురుగుల మందు తాగి చావాలి. మా స‌మ‌స్య‌ల‌ను వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్తాం. ప్ర‌భుత్వం ఒత్తిడి తెస్తాం. 
సింహాద్రి ష‌ణ్ముక‌రెడ్డి, పొగాకు రైతు, తాడ‌వాయి గ్రామం
-------------------------------------------------------------------------------------------------------------------------
ఈ ఏడాది చాలా త‌క్కువ‌గా ఉంది
గ‌తేడాది కంటే ఈ యేడాది పొగాకు ధ‌ర చాలా త‌క్కువ‌గా ఉంది. సంవ‌త్స‌రానికి రెండు ఎక‌రాలు అమ్మితేగానీ వ్య‌వసాయం చేసే దారి లేదు
జి. గాంధీ, పొగాకు రైతు
-------------------------------------------------------------------------------------------------------------------
గిట్టుబాటు ధ‌ర లేదు
పొగాకు రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. చంద్ర‌బాబు స‌ర్కార్ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే మా బాధ‌లు ఇంకా ఎక్కువ‌య్యాయి. ప్రతిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ వ‌స్తున్నారంటే హ‌డావుడిగా మంత్రి వ‌చ్చి వెళ్లడ‌మే త‌ప్ప మంత్రి మాకు చేసింది ఏమీ లేదు. కోఆప‌రేటివ్‌ వ్య‌వ‌స్థ‌ను సైతం బాబు నాశ‌నం చేస్తున్నారు. కోఆప‌రేటివ్‌లో ఇచ్చే స‌బ్సిడీలు ఇవ్వ‌కుండా చేస్తున్నారు
గంగాధ‌ర‌రావు, పొగాకు రైతు తాడ‌వాయి గ్రామం
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------
పండించ‌వ‌ద్ద‌ని ప్ర‌భుత్వ‌మైనా చెప్పాలి
చంద్ర‌బాబు స‌ర్కారు పొగాకును పండించ‌వ‌ద్ద‌ని నేరుగా చెప్పాలి. అంతేగానీ ఇలా గిట్టుబాటు ధ‌ర క‌ల్పించ‌కుండా రైతుల‌ను ఇబ్బందుల‌కు గురి చేయ్యొద్దు. మా బాధ‌లు తెలుసుకోవ‌డానికి వ‌స్తున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు మా స‌మ‌స్య‌లు వివ‌రిస్తాం. రైతుల ప‌క్షాన నిల‌బ‌డి మాకు మ‌ద్ద‌తు తెలిపి పోరాడాల‌ని వైయ‌స్ జ‌గ‌న్‌ను కోరుతాం. మా స‌మ‌స్య‌ల‌ను కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల దృష్టికి తీసుకెళ్లాల‌ని వైయ‌స్ జ‌గ‌న్‌ను కోరుకుంటాం.
ప్ర‌సాద్, పొగాకు రైతు, చిన్న‌వారిగూడెం గ్రామం
------------------------------------------------------------------------------------------------------------------------------------------
జ‌గ‌న్ వ‌స్తే మిగ‌తా రాజ‌కీయ పార్టీలు వ‌చ్చాయి
ప్ర‌భుత్వం రైతుల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. గ‌తేడాది వైయ‌స్ జ‌గ‌న్ వస్తున్నారంటే మిగ‌తా రాజ‌కీయ పార్టీలు వ‌చ్చాయి. ప్ర‌భుత్వం నుంచి మాత్రం రైతులకు ఎటువంటి ఉప‌యోగాలు లేకుండా పోయాయి. ప్ర‌భుత్వం మా స‌మ‌స్య‌ల‌ను వినే ప‌రిస్థితి కూడా లేదు
పోల్నాటిబాబ్జీ, పొగాకు రైతు, శ్రీ‌నివాసపురం
----------------------------------------------------------------------------------------------------------------------------------------
బాబు పాల‌న మ‌ళ్లీ క‌న‌బ‌డుతుంది
2000 సంవ‌త్స‌రం నాటి పాల‌న తిరిగి వ‌చ్చింది. ఏం చేయాలో తెలియ‌ని అగ‌మ్య‌గోచ‌రంగా రైతుల ప‌రిస్థితి మారింది. చంద్ర‌బాబు మోస‌పూరిత హామీల‌తో ఇటు రైతులు, అటు అన్ని వ‌ర్గాల‌ను మోసం చేశాడు. బాబు ప్ర‌జ‌ల జీవితాల‌తో ఆడుకుంటున్నాడు.
గోదా శ్రీ‌నివాస‌రెడ్డి, పొగాకు రైతు
----------------------------------------------------------------------------------------------------------------------------------------
మూడేళ్లుగా గిట్టుబాటు ధ‌ర లేదు
20 ఏళ్లుగా పొగాకును సాగు చేస్తున్నాను. గ‌త రెండేళ్లుగా రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించ‌డం లేదు. భ‌విష్య‌త్ మొత్తం శూన్యంలాగా అనిపిస్తుంది.
నాగేశ్వ‌ర‌రావు, పొగాకు రైతు
-----------------------------------------------------------------------------------------------------------------------------------
ప్ర‌భుత్వం తీర‌ని అన్యాయం చేస్తుంది
పొగాకు రైతుల‌కు ప్ర‌భుత్వం తీర‌ని అన్యాయం చేస్తుంది. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే పొగాకు రైతులు వ్య‌వ‌సాయం మానుకునే పరిస్థితి వ‌స్తుంది. ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌కు మా స‌మ‌స్య‌ల‌ను విన్నవించుకుంటాం.
రాఘ‌వ‌రాజు ఆదివిష్ణు, పొగాకు రైతు జంగారెడ్డిగూడెం
Back to Top