మ‌హిళా మంత్రుల‌కు చ‌ల‌నం లేదా..!

హైద‌రాబాద్‌ : గుంటూరు నాగార్జున విశ్వ విద్యాల‌యంలో ర్యాగింగ్ కార‌ణంగా ఒక
విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకొన్న ఘ‌ట‌న‌పై వైఎస్సార్‌సీపీ మ‌హిళా విభాగం
అద్య‌క్షురాలు, ఎమ్మెల్యే రోజా న్యాయ విచార‌ణ‌కు డిమాండ్ చేశారు. ఈ
మ‌ర‌ణంపై అన్ని కోణాల్లో స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌గాల‌ని ఆమె అన్నారు. .
హైద‌రాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
ఇంత‌టి ఘోరం జ‌రిగినా క‌నీసం మ‌హిళా మంత్రుల్లో ఏమాత్రం స్పంద‌న లేద‌ని ఆమె
మండిప‌డ్డారు. ఈ మ‌హిళా మంత్ర‌లు గాడిద‌లు కాస్తున్నారా అని ఆమె
నిల‌దీశారు. ఈ కేసును నీరుగార్చేందుకు పెద్ద స్థాయిలో ప్ర‌య‌త్నాలు
జ‌రుగుతున్నాయ‌ని ఆమె అన్నారు.

Back to Top