విజయనగరం(పార్వతీపురం): చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర మండిపడ్డారు. టీడీపీ నాయకులు, వారి బంధువులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు. రెండు రోజుల క్రితం సాలూరులో మునిసిపల్ ఉద్యోగినిపై ఓ టీడీపీ కౌన్సిలర్ అత్యాచారయత్నం చేసిన ఘటనపై పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ అంశాన్ని శాసనసభలో లేవనెత్తుతామని చెప్పారు. ఈ ఘటనపై మహిళా డీఎస్పీతో విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని రాజన్నదొర డిమాండ్ చేశారు.<br/>