మహిళా సదస్సు పోస్టర్‌ ఆవిష్కరించిన విజయమ్మ

హైదరాబాద్, 30 ఏప్రిల్ 2013 : గుంటూరు జిల్లా బాపట్లలో మే 5న జరగనున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మహిళా విభాగం సదస్సు పోస్టర్‌ను పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ మంగళవారంనాడు ఆవిష్కరించారు. జూబ్లీహిల్సు లోటస్‌పాండ్‌లోని తన నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. బాపట్ల ఆర్ట్సు అండ్‌ సైన్సు కళాశాల ఆవరణలో మే 5న జరిగే సదస్సు సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభలో శ్రీమతి విజయమ్మ పాల్గొంటారు. రాష్ట్రం నలుమూలల నుంచి విశేష సంఖ్యలో హాజరయ్యే పార్టీ మహిళా ప్రతినిధులను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తారు.
Back to Top